రాష్ట్రపతికి కరోనా అంటించడానికి చంద్రబాబు ఎంపీలను పంపారు: ఎంపీ గోరంట్ల

రాష్ట్రపతికి కరోనా అంటించడానికి చంద్రబాబు ఎంపీలను పంపారు: ఎంపీ గోరంట్ల
x
Highlights

టిడిపి ఎంపీలు రాష్ట్రపతిని కలవడం పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. రాష్ట్రపతికి కరోన అంటించడానికి చంద్రబాబు ఎంపీలను పంపారని ...

టిడిపి ఎంపీలు రాష్ట్రపతిని కలవడం పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. రాష్ట్రపతికి కరోన అంటించడానికి చంద్రబాబు ఎంపీలను పంపారని అన్నారు. అసత్యాలతో తప్పుడు నివేదికను రాష్ట్రపతికి సమర్పించారు. నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరిస్తోందన్నారు. పోలీసుల విచారణలో నేరం రుజువై కోర్టు అనుమతితోనే ఎవరినైనా జైల్లో పెడతారు ప్రభుత్వానికి అచ్చెన్నాయుడు, ఇతరుల కేసులకు ఎటువంటి సంబంధం లేదు. గల్లా జయదేవ్ ఆస్తులు ఏ రకంగా కూడబెట్టారు ప్రభుత్వ ఆస్తులను ఏ రకంగా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసున్నారు. నిన్న రాష్ట్రపతిని కలిసిన వారిలో ఒక ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి మరొకాయన చిన్నన్నాను కాపాడుకోవడానికి కలిసినట్లు ఉందని ఎంపీ గోరంట్ల మాధవ్ ఎద్దేవా చేశారు.
Show Full Article
Print Article
Next Story
More Stories