మళ్లీ నోరు జారిన స్పీకర్ తమ్మినేని

admin1
Published on: 28 Nov 2019 10:37 PM IST
thammineni seetharam
X
thammineni seetharam

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆయన నోటికి పని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ అధికారులను కొడతానంటూ వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని ఉద్యోగులపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తంచేశారు..సిఎంవో నుంచి చెప్పారు తప్పితే జిల్లా అధికారులు కనీసం సమాచారం ఇవ్వలేదని అధికారులపై సీతారాం సీరియస్ అయ్యారు. మరోసారి ఇలా జరిగితే స్పాట్ లోనే కొడతానంటూ అధికారులను హెచ్చరించారు.. అధికారులను కొడతానంటూ తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

admin1

admin1

Next Story