Ram Gopal Varma: RGV కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు.. మొత్తం 6 పోలీస్ బృందాలతో గాలింపు..

Ram Gopal Varma: RGV రిట్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Nov 2024 4:30 PM IST
Ram Gopal Varma
X

RGV కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు.. 

Ram Gopal Varma: RGV రిట్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. FIR నమోదు చేయకుండా ఆదేశాలివ్వాలని ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం విచారించనుంది హైకోర్టు. మరోవైపు RGV కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కేరళ, తమిళనాడు సహా తెలుగురాష్ట్రాల్లో ఆర్జీవీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. మొత్తం 6 పోలీస్ బృందాలు ఈ సెర్చ్‌ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.

2014 నుంచి ఇప్పటివరకు ఆర్జీవీపై 9 కేసులు నమోదవగా.. ఇప్పటివరకు ఒక్క కేసులోనూ ఆయన విచారణకు హాజరవలేదు. దాంతో విచారణకు ఆర్జీవీ హాజరవ్వాలని పట్టుబట్టారు ప్రకాశం జిల్లా పోలీసులు. ఓ వైపు ఆర్జీవీ వీడియోలు పోస్టు చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తుండగా.. ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫోన్ సిగ్నల్‌ ఆధారంగా వర్మ ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు మరింత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేందుకు సిద్దమవుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story