సీఎం జగన్ కు పదికాలాలు పరిపాలించే "శక్తిని" ప్రసాదించు స్వామీ: ఏపీ మంత్రి శంకర్ నారాయణ

ఏపీ మంత్రి శంకర్ నారాయణ ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.

K V D Varma
Updated on: 20 Oct 2019 12:53 PM IST
సీఎం జగన్ కు పదికాలాలు పరిపాలించే శక్తిని ప్రసాదించు స్వామీ: ఏపీ మంత్రి శంకర్ నారాయణ
X

(తిరుమల, శ్యామ్‌.కె‌.నాయుడు)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాజా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ‌ పథకాలు సక్రమంగా ప్రజలకు అందేలా, అర్థిక పరిపుష్టి ప్రభుత్వానికి సక్రమించేలా ఆశీస్సులు అందివ్వమని అలాగే పది కాలాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి , మనోధైర్యాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రసాదించమని వెంకటేశ్వరస్వామి వేడుకున్నట్లు మంత్రి శంకర్ నారాయణ మీడియాకు చెప్పారు.

ఈరోజు తిరుమలలో శ్రీవారిని ఏపీ బిసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లిన ఆయన, ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకొని అనంతరం స్వామివారి మూలవిరాట్టుని దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రిని పండితులు ఆశీర్వాదించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

K V D Varma

K V D Varma

Next Story