AP Liquor Shops Tenders: నేటితో ముగియనున్న గడువు.. భారీగా అప్లికేషన్లు దాఖలయ్యే అవకాశం

AP Liquor Shops Tenders: ఏపీలో లిక్కర్ షాపుల లైసెన్సులకు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Oct 2024 7:47 AM IST
AP Liquor Shops Tenders Ends Today
X

AP Liquor Shops Tenders: నేటితో ముగియనున్న గడువు.. భారీగా అప్లికేషన్లు దాఖలయ్యే అవకాశం

AP Liquor Shops Tenders: ఏపీలో లిక్కర్ షాపుల లైసెన్సులకు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 వేల 424 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ కూడా భారీ స్థాయిలో అప్లికేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. లిక్కర్ లైసెన్సుల కోసం అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 4 వేల 839 అప్లికేషన్లు రాగా, ఆ తర్వాతి స్థానంలో ఏలూరు జిల్లాలో 4 వేల 260 అప్లికేషన్లు వచ్చాయి.

విజయనగరంలో 4 వేల 110 దరఖాస్తులు, అతి తక్కువగా అల్లూరి సీతారామారాజు జిల్లాలో 869 మద్యం అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు మద్యం దరఖాస్తుల ప్రక్రియ ముగియనుండటంతో భారీగా టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story