Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవులను ప్రకటించిన సర్కార్.. ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ

AP Nominated Posts List: ఏపీలో పలు నామినేటెడ్‌ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 Sept 2024 1:18 PM IST
Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవులను ప్రకటించిన సర్కార్.. ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ
X

AP Nominated Posts List: ఏపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి..20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. టీడీపీ-16, జనసేన-3, బీజేపికి ఒకటి చొప్పున పోస్టులను భర్తీ చేసింది. 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా లంకా దినకర్, ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా పీ.ఎస్. మునిరత్నం, ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మంతెన రామరాజు, ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా కర్రోతు బంగార్రాజును నియమించారు.

అలాగే..ఏపీటీడీసీ ఛైర్మన్‌గా నూకసాని బాలాజీ.. శాప్ ఛైర్మన్‌గా రవినాయుడు.. గృహ నిర్మాణ బోర్డు ఛైర్మన్‌గా తాతయ్య నాయుడు..వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్ అజీజ్, సీడాప్ ఛైర్మన్‌గా దీపక్‌రెడ్డి, పద్మశాలీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నందం అబద్దయ్య, ట్రైకార్ ఛైర్మన్‌గా బొరగం శ్రీనివాసులు, మారిటైమ్ బోర్డు ఛైర్మన్‌గా దామచర్ల సత్య..సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మన్నె సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story