Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Arun Chilukuri
Published on: 31 Dec 2021 3:52 PM IST
AP Government Allowing Bars and Wine Shops Till mid Night December 31 2021
X

Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ 

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయమే తీసుకుంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో వైన్ షాపులు మూసివేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12గంటల వరకు బార్లకు అనుమతిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. వైన్ షాపులు రాత్రి 10గంటల వరకే తెరిచి ఉంటాయని.. అయితే 10గంటల లోపు క్యూలో ఉన్నవారికి ఆ తర్వాత కూడా మద్యం విక్రయిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు 2021, డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం ఉత్తర్వులు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ జారీ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story