Nuzvid: ఎన్నికలు వాయిదా పడినా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది

Nuzvid: ఎన్నికలు వాయిదా పడినా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది
x
Highlights

నూజివీడు మండలం మిట్ట గూడెం గ్రామంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించినారు. ఈ సందర్భంగా ఈ గ్రామా ల్లోని వీధుల్లో తిరుగుతూ మైక్ ద్వారా ప్రచారం చేయించారు.

నూజివీడు: జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినను ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, గత కొన్ని రోజు ల క్రితం నూజివీడు సబ్ డివిజన్ లోని సమస్యాత్మక గ్రామాలను డీఎస్పీ బి.శ్రీనివాసులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగా నూజివీడు సర్కిల్ లోని ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో డి.ఎస్.పి బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రామచంద్రరావు, సర్కిల్ లోని ఎస్ఐలు, సర్కిల్ సిబ్బందితో మార్చ్ఫాస్ట్ నిర్వహించినారు.

అనంతరం నూజివీడు మండలం మిట్ట గూడెం గ్రామంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించినారు. ఈ సందర్భంగా ఈ గ్రామా ల్లోని వీధుల్లో తిరుగుతూ మైక్ ద్వారా ప్రచారం చేయించారు. గ్రామాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలు వాయిదా పడిన ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తరువాత జరగబోయే ఎన్నికల్లో కూడా ఎక్కడ మద్యం పంచరాదని, డబ్బులు పంచ రాదని ఓటర్లను ప్రలోభ పెట్టి ఎటు వంటి కార్యక్రమా లు చేయరాదని అట్లా చేసిన వారి యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్క పౌరుడు పోలీసులకు తెలియపరచాలని గ్రామస్తులకు తెలియజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories