AP EAPCET: ఏపీఈఏపీ సెట్‌ షెడ్యూల్‌ విడుదల

AP EAPCET: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్‌-2022 షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 23 March 2022 4:32 PM IST
AP Education Minister Adimulapu Suresh Announces AP EAPCET 2022 Schedule
X

AP EAPCET: ఏపీఈఏపీ సెట్‌ షెడ్యూల్‌ విడుదల

AP EAPCET: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్‌-2022 షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జులై 4 నుంచి 8 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షలు, జులై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 11న EAP సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుండగా.. మొత్తం 136 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. తెలంగాణలో 4 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక ఆగస్టులో EAP సెట్‌ ఫలితాలు, సెప్టెంబర్‌లో కౌన్సిలింగ్‌, సెప్టెంబర్‌ రెండో వారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్టు స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story