Pawan Kalyan: నామినేటెడ్ పదవులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నామినేటెడ్ పోస్టులపై కసరత్తు జరుగుతోంది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 16 July 2024 4:15 PM IST
AP Deputy CM Pawan Kalyan key comments on nominated posts
X

Pawan Kalyan: నామినేటెడ్ పదవులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు 

Pawan Kalyan: నామినేటెడ్ పదవులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ‌్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని మరిచిపోమని చెప్పుకొచ్చారు. కొద్ది రోజులుగా ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల పైన కసరత్తు జరుగుతోందన్నారు. ఎన్నికల్లో సీట్లు దక్కని వారితో సహా... మూడు పార్టీల్లో కీలక స్థానాల్లో ఉన్న వారు నామినేటెడ్ పదవుల పైన ఆశలు పెట్టుకున్నారని వారిలో జనసేన నుంచి ఆశావాహులు ఉన్నట్టు తెలిపారు. పదవుల కోసం కాదు ప్రజా సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం కలిసి పోటీ చేశామనే విషయాన్ని జన సైనికులు గుర్తు పెట్టుకోవాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని మర్చిపోమని స్పష్టం చేశారు.. హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందన్న పవన్ ఆ విధంగానే నామినేటెడ్ పోస్టులు ఉంటాయని స్పష్టం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story