Pawan Kalyan: ఢిల్లీకి పవన్ కల్యాణ్.. సాయంత్రం అమిత్ షాతో భేటీ..

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం, విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Nov 2024 11:10 AM IST
AP Deputy CM Pawan Kalyan Delhi Tour
X

Pawan Kalyan: ఢిల్లీకి పవన్ కల్యాణ్.. సాయంత్రం అమిత్ షాతో భేటీ..

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం, విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను పవన్.. అమిత్ షాకు వివరించనున్నారు. ఏపీకి రావాల్సిన కేంద్ర నిధులపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.

రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పోలీసు అధికారుల పనితీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు మంగళవారం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ప్రాజెక్టు భూములను పరిశీలించారు. అయితే, అమిత్ షాతో భేటీలో పవన్ ఈ రెండు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అమిత్ షాతో భేటీ తరువాత పవన్ కల్యాణ్ ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకుంటారు. కొద్దిసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఢిల్లీలో విమానాశ్రయానికి చేరుకొని విమానం ద్వారా రాత్రి 10.40గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి పవన్ కల్యాణ్ చేరుకుంటారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story