ఎన్నికల వాయిదాపై ముఖ్యమంత్రి జగన్ అసంతృప్తి!
కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
YS Jagan and Governor (file Photo)
కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన అసహనం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారంటూ ఆయన ఎన్నికల సంఘంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని అయన అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై కాసేపట్లో అయన గవర్నర్ విశ్వభూషణ్ హరిశ్చంద్రకు ఫిర్యాదు చేయడానికి జగన్ సమాయత్తమవుతున్నారు.
Next Story




