మాట ఇచ్చాను.. బెల్ట్ షాపులు పూర్తిగా మూతబడతాయి..
మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాటిచ్చానని ఇందులో భాగంగానే మద్యం నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టు దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు జగన్ ట్విటర్‌లో పోస్టు చేశారు. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ నూతన చట్టాన్ని తెచ్చామన్నారు. గ్రామాల్లో మద్యం బెల్టులు పూర్తిగా మూతపడతాయని సీఎం జగన్ అన్నారు.
మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం. తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయి.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 25, 2019
Next Story




