CM YS Jagan: నేడు దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్

CM YS Jagan: ఏపీలో అన్ని స్థానాల్లో విజయమే టార్గెట్‌గా పెట్టుకున్న వైసీపీ

Shekhar G
Published on: 3 Feb 2024 8:41 AM IST
Ap Cm Jaganmohan Reddy Siddham Public Meeting In Denduluru Today
X

CM YS Jagan: నేడు దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్

CM YS Jagan: 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. ఇక సిద్ధం పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా గతవారం విశాఖ జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్‌హిట్‌ అయిన నేపథ్యంలో ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం రెండో సభ నిర్వహిస్తున్నారు.

ఈ సభకు ఉత్తర కోస్తాలోని 50 నియోజకవర్గాల నుంచి భారీగా శ్రేణులు, అభిమానులు తరలిరానున్నారు. ఏలూరు నగర శివారు ఆటోనగర్‌ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది. లక్షలాది మంది వైసీపీ శ్రేణుల రాక నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సభా ప్రాంగణం, ఎనిమిది ప్రాంతాల్లో 150 ఎకరాల్లో పార్కింగ్‌ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం లక్షలాదిగా తరలివచ్చే పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారు.

Shekhar G

Shekhar G

Next Story