ఏపీ సీఎం జగన్ కడప పర్యటన షెడ్యూల్ ఇదే!

K V D Varma
Updated on: 7 Aug 2019 2:37 PM IST
ఏపీ సీఎం జగన్ కడప పర్యటన షెడ్యూల్ ఇదే!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9.35 గంటలకు సీఎం కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 9.40కి హెలికాప్టర్ లో బయల్దేరి 10.10కి పులివెందులోల ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ చేరకుంటారు. 10.20కి అక్కడి నుంచి బయల్దేరి 10.30కి భాకరాపురం పాల కేంద్రానికి చేరుకుంటారు. 10.35 నుంచి 10.55 గంటల వరకు దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివకానందరెడ్డి విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అక్కడి నుంచి 11గంటలకు బయల్దేరి 11.15కు ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి చేరుకుంటారు. 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తారు. 12.15 నుంచి 12.45 వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి 12.50కి బయల్దేరి 12.55 నిమిషాలకు హెలిప్యాడ్‌ చేరుకుని ఒంటిగంటకు అనంతపురం జిల్లా పెనుగొండకు బయల్దేరతారు.


K V D Varma

K V D Varma

Next Story