Chandrababu Naidu: ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

Chandrababu Naidu: ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సహాయంపైనా అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 July 2024 6:15 PM IST
AP CM Chandrababu visit to Delhi has ended
X

Chandrababu Naidu: ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. రాత్రి 9గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు.. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సహాయంపైనా అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. అదుపు తప్పిన ఆర్థిక పరిస్థితి, అప్పులను వివరిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాలను అమిత్ షాకు వివరించానని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఏపీలో ఎన్డీఏకు అనుకూలంగా తీర్పునిచ్చారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెడతాయని చంద్రబాబు ట్వీట్ చేశారు.

కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అవుతారని వార్తలు వచ్చినా సమావేశం కాలేదు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసం జన్‌పథ్‌లో చంద్రబాబు పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన కేవలం కొన్ని గంటలు మాత్రమే సాగింది. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు.. అధికారులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story