Chandrababu Naidu: నేడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలకు రానున్నారు. తిరుమలకు చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 4 Oct 2024 12:13 PM IST
Chandrababu Naidu
X

Chandrababu Naidu: నేడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు

CM Chandrababu Naidu Tirumala Schedule: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలకు రానున్నారు. తిరుమలకు చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికీ సీఎం చంద్రబాబునాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 7గంటలకు తిరుమలకు చంద్రబాబు చేరుకోనున్నారు. రాత్రి 8గంటలకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి శ్రీవారికీ పట్టవస్త్రాలను చంద్రబాబు సమర్పించనున్నారు. దర్శనాంతరం 2025 డైరీ, క్యాలెండర్లను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీవారిని ఊరేగిస్తారు. ఈ ఉత్సవాల్లో చంద్రబాబు దంపతులు పాల్గొంటారు.

సీఎం చంద్రబాబు తిరుమల వస్తుండటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న అంకురార్పణ కార్యక్రమం జరిగింది. స్వామి సర్వసేనాధిపతైన విష్వక్సేనుడు ఊరేగింపుగా మాడవీధిలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత యాగశాలలో శాస్త్రోక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story