Chandrababu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 26 July 2024 1:21 PM IST
AP CM Chandrababu To Meet Nirmala Sitharaman
X

Chandrababu: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత మొదటిసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు సాయంత్రంతో ముగియనుండటంతో ఆయన సాయంత్రం ఢిల్లీకి పయమనమవుతారు.

రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఏపీకి సంబంధించిన అంశాలపై సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు. పోలవరం ప్రాజెక్టు, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చంద్రబాబు మాట్లాడనున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీకానున్నారు. ఏపీకి కేటాయింపులపై సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు. పలువురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలవనున్నారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story