ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు టూర్‌

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Aug 2024 9:41 AM IST
AP CM Chandrababu Naidu will meet PM Modi And Union Ministers
X

ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు టూర్‌

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులు, పెద్దలను సీఎం చంద్రబాబు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.

అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. రాత్రి 7గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story