ప్రధాని మోడీతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ..

Chandrababu: ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 July 2024 12:16 PM IST
AP CM Chandrababu Naidu Meeting Ends With PM Narendra Modi
X

ప్రధాని మోడీతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ..

Chandrababu: ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించినట్లుగా తెలుస్తోంది. బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు చంద్రబాబు కోరినట్లు సమాచారం.

అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. మధ్యాహ్నం కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో సీఎం భేటీ అవుతారు. సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హర్దీప్‌ సింగ్‌ పురీతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story