Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు

Polavaram Project: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌‌పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెంచింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Jun 2024 1:00 PM IST
AP CM Chandrababu Naidu Inspects Polavaram Project
X

Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు

Polavaram Project: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌‌పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. నిర్మాణం వేగవంతం చేయడానికి సీఎం చంద్రబాబు దృష్టిసారించారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ సోమవారం పోలవరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు తాజాగా ఈరోజు పోలవరాన్ని సందర్శించారు. ప్రాజెక్ట్‌పై పూర్తి స్టేటస్‌ను అధికారులను అడిగి తెలుసుకుకున్నారు.

అంతకుముందే పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్‌ నుంచి స్పిల్‌వే సహా వివిధ ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే తొలి పర్యటన. 2014-19 మధ్య సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టారు. ఇకపై ప్రతినెల మూడో సోమవారం పోలవరం సందర్శించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story