AP Govt: మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి సర్కారు కసరత్తు

AP Govt: ఏపీలో మరో హామీ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. ఎన్నికల సమయంలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని కూటమి హామీ ఇచ్చింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Sept 2024 11:14 AM IST
Ap CM Chandrababu Directive To Formulate BC Protection Act
X

AP Govt: మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి సర్కారు కసరత్తు

AP Govt: ఏపీలో మరో హామీ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. ఎన్నికల సమయంలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు కసరత్తు ప్రారంభమైంది. బీసీ సంక్షేమశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

అలాగే ఏపీవ్యాప్తంగా బీసీ భవనాలను నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే నిర్మాణం ప్రారంభమై అసంపూర్తిగా ఉన్నవాటికి నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి సవిత వెల్లడించారు. బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారన్న మంత్రి.. చట్ట సభల్లో బీసీలకు ప్రాతినిథ్యం పెంచేలా కేంద్రానికి సిఫార్సు చేస్తామన్నారు. ఏపీలో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరిస్తామన్న చంద్రబాబు నాయుడు.. విదేశీ విద్యాసంస్థలలో అత్యధిక మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story