AP News: ఏపీలో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు

AP News: ఏపీలో వివాదాస్పద ఐపీఎస్‌లపై వేటు పడింది. సీఐడీ చీఫ్ సంజయ్‌తోపాటు.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌‌మెంట్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్ ఆదేశాలు జారీచేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 8 Jun 2024 1:29 PM IST
AP Cid Chief Sanjay And Sit Chief Kolli Raghuram Reddy Transferred
X

AP News: ఏపీలో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు

AP News: ఏపీలో వివాదాస్పద ఐపీఎస్‌లపై వేటు పడింది. సీఐడీ చీఫ్ సంజయ్‌తోపాటు.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌‌మెంట్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్ ఆదేశాలు జారీచేశారు. సంజయ్‌ను GADకి.. రఘురామిరెడ్డిని డీజీపీకి రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసి జైలుకు పంపడంలోనూ కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా పనిచేశారు. సీఐడీ ఏడీజీగా పనిచేసిన సంజయ్.. అధికార పార్టీ పెద్దల ఆదేశాలతో చంద్రబాబుపై కేసులు నమోదు చేశారు. వీరిద్దరినీ ఆయా పదవులనుంచి తప్పించిన ప్రభుత్వం.. ఆ బాధ్యతలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story