AP Cabinet: ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభం.. నాలుగు​ కీలక అంశాలపై చర్చ

AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 July 2024 11:59 AM IST
AP Cabinet Meeting Started
X

AP Cabinet: ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభం.. నాలుగు​ కీలక అంశాలపై చర్చ

AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో నాలుగు కీలక అంశాలను చర్చించాలని నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ రద్దుకు ఆమోదం తెలిపాలని నిర్ణయం తీసుకుంది. ఇసుక పాలసీకి సంబంధించిన విధివిధానాల ఖరారు చేసి ఆమోదం తెలపనుంది. పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖల నుంచి లోన్లు తీసుకునే అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ పొడిగింపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే వీలుంది. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story