ఏపీ బీజేపీకి బిగ్ షాక్..వైసీపీలోకి కీలక నేతలు

-వైసీపీలోకి బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు -రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కప్పుకోనున్న గోకరాజు

admin1
Published on: 8 Dec 2019 10:17 PM IST
ఏపీ బీజేపీకి బిగ్ షాక్..వైసీపీలోకి కీలక నేతలు
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

ఏపీలో బీజేపీకి షాకిచ్చారు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు. వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఏపీ రాజకీయాల్లో మొదటి నుంచి బీజేపీకి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. రేపు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ కండువ కప్పుకోనున్నారు. గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజు, సోదరులు నరసింహరాజు, రామరాజు వైసీపీలో చేరనున్నారు.

admin1

admin1

Next Story