Nandyal: మహానందిలో మరోసారి చిరుత సంచారం

Nandyal: గోశాల దగ్గర మాఢవీధుల్లో కనిపించిన చిరుత

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Jun 2024 12:51 PM IST
Another cheetah migration in Mahanandi
X

Nandyal: మహానందిలో మరోసారి చిరుత సంచారం 

Nandyal: నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గోశాల వద్ద నుంచి మహానంది ఆలయం వెనుక ఉన్న మాడవీధుల్లో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుత సంచారం సీసీ కెమెరాకు చిక్కింది. గత 15 రోజుల నుండి గోశాల వద్ద మాడవీధుల్లో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. చిరుత సంచారంతో మహానంది గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదం జరగక ముందే అటవీ అధికారులు చిరుతను బంధించాలంటున్నారు స్థానికులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story