Annavaram: సత్యదేవుని సన్నిధిలో మహావైకుంఠ నారాయణ యాగం

అన్నవరం..లోకకల్యాణం , భక్తజనసంరక్షణార్ధం రేపటి నుండి అన్నవరం సత్యదేముని సన్నిధిలో వారం రోజుల పాటు మహావైకుంఠనారాయణ యాగంనిర్వహించనున్నారు.

S. Srikanth
Updated on: 11 March 2020 12:31 PM IST
Annavaram: సత్యదేవుని సన్నిధిలో మహావైకుంఠ నారాయణ యాగం
X
అన్నవరం

అన్నవరం..లోకకల్యాణం , భక్తజనసంరక్షణార్ధం రేపటి నుండి అన్నవరం సత్యదేముని సన్నిధిలో వారం రోజుల పాటు మహావైకుంఠనారాయణ యాగంనిర్వహించనున్నారు. ఇప్పటికే యజ్ఞవాటికలు , హోమ గుండాలు తో బాటు ,వివిధ వృక్ష జాతుల ధాతువులు సంసిద్ధం చేసి భక్తుల సౌకర్యార్థం తాటాకు చలువ పందిళ్లు నిర్మించారు.రేపు 9 గంటలకు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా ఆహుతుల నడుమ యాగం ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

సకల దేవతల అనుగ్రహంగా చతుర్వేదాలలో మంత్రాలతో నారాయణ ప్రీత్యర్ధం హోమం నిర్వహిస్తారు.రేపు అనగా 11 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు జరుగు ఈ చతుర్వేద సంహిత మహావైకుంఠ నారాయణ యాగంలో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొని తరించవలసినదిగా దేవస్థానం EO వేండ్ర.త్రినాథరావు ఒక ప్రకటనలో కోరారు.


S. Srikanth

S. Srikanth

Next Story