Anil Kumar Yadav: పవన్‌ భీమ్లా నాయక్ కాదు.. బిచ్చం నాయక్..!

Anil Kumar Yadav: తానెవరికీ పోటీ కానని, తనతో తనకే పోటీ అని అన్నారు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌.

Arun Chilukuri
Updated on: 17 April 2022 8:31 PM IST
Anil Kumar Yadav Fires on Pawan Kalyan
X

Anil Kumar Yadav: పవన్‌ భీమ్లా నాయక్ కాదు.. బిచ్చం నాయక్..! 

Anil Kumar Yadav: తానెవరికీ పోటీ కానని, తనతో తనకే పోటీ అని అన్నారు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లో ఆత్మీయ సభలో పాల్గొన్న అనిల్.. ఎవరికీ పోటీగా సభను ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో వర్గాలు ఉండవని, ఉన్నదంతా ఒకటే వర్గమని, అది జగనన్న వర్గమని చెప్పారు. రాజన్న గుండె భరోసా ద్వారా గడప గడపకు వెళ్తానన్నారు అనిల్.

2024లో జగన్‌ను మరోసారి సీఎం చేయడానికి కృషి చేస్తామన్న మాజీ మంత్రి.. సింగిల్‌గా వచ్చి జగన్‌ను ఓడించే దమ్ము టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా.. వైసీపీని ఏం చేయలేరని తేల్చిచెప్పారు మాజీమంత్రి అనిల్. ఇక 140 స్థానాల్లో పోటీచేస్తేనే పవన్‌ భీమ్లానాయక్‌ అని, లేకపోతే బిచ్చం నాయక్‌ అని విమర్శలు చేశారు అనిల్.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story