ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు!

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపులకు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది.

admin
Updated on: 24 Oct 2020 8:21 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు!
X

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపులకు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. దాని ప్రకారం జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. ఇక జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించారు. సీఎం జగన్‌ నిర్ణయంతో 4లక్షల 49వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు.. 3లక్షల 57వేల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

admin

admin

Next Story