కరోనా పై యుద్ధానికి జగన్ సర్కార్ కీలక నిర్ణయం..వారికి 14 రోజుల సెలవు?

కరోనా పై యుద్ధానికి జగన్ సర్కార్ కీలక నిర్ణయం..వారికి 14 రోజుల సెలవు?
x
Y.S.Jaganmohan Reddy (file photo)
Highlights

కరోనా వైరస్ పై యుద్ధాన్ని మరింత ముమ్మరం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కరోనా నియంత్రణ కోసం ప్రత్యెక చర్యలను వేగవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి...

కరోనా వైరస్ పై యుద్ధాన్ని మరింత ముమ్మరం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కరోనా నియంత్రణ కోసం ప్రత్యెక చర్యలను వేగవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసింది ప్రభుత్వం.

దీనికోసం అన్ని జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ టెస్టింగ్‌ పరికరాలు, బెడ్లు, మందులు, సిబ్బందిని పెద్ద ఎత్తున రెడీ చేసింది ప్రభుత్వం. ఇక తమ ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టి పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వారు వారం రోజులు తమ సేవలు అందిస్తే.. 14 రోజుల పాటు సెలవు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలో 4 కోవిడ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రులను గుర్తించింది. రాష్ట్రస్థాయి ఆస్పత్రులలో 444 ఐసీయూ బెడ్లు, 1,680 నాన్‌ ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 284 ఐసీయూ, 1,370 నాన్‌ ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉన్నాయి.

ఇక ఇప్పుడు 13 జిల్లా కోవిడ్‌ ఆస్పత్రులలో 650 ఐసీయూ, 8950 నాన్‌ ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 334 ఐసీయూ, 6,662 నాన్‌ ఐసీయూ బెడ్లను సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయిలోని ఒక్కో ఆస్పత్రిలో 100కు పైగా ఐసీయూ కెపాసిటీ, స్పెషలిస్టు డాక్టర్లు ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లో 648 స్పెషలిస్ట్ డాక్టర్లు, 792 పీజీ డాక్టర్లు, 792 హౌస్ సర్జన్లు, 1152 నర్సింగ్ సిబ్బందిని సిద్ధం చేసింది. జిల్లా కోవిడ్‌ ఆస్పత్రుల్లో 546 స్పెషలిస్ట్ డాక్టర్లు, 546 పీజీ డాక్టర్లు, 273 హౌస్ సర్జన్లు, 546 నర్సింగ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. అలాగే వైద్య సిబ్బందికి ఎన్‌ 95 మాస్క్‌లు, పీపీఈలు అందుబాటులో ఉంచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories