రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చర్చకు వచ్చే అంశాలివే.!

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చర్చకు వచ్చే అంశాలివే.!
x
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
Highlights

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు పది రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు పది రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సెషన్ లో 20 ప్రధానాంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలిరోజు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంపై చర్చించే అవకాశం ఉంది. ఈ సందర్బంగా కఠిన చట్టాలను తయారు చేయాలనీ అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది.

ఆ తరువాతి రోజుల్లో ఎస్సి, ఎస్టీ, బీసీ లకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం చర్చకు రానుంది. అలాగే వచ్చే ఏడాది విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరిచేస్తూ.. తెలుగును సబ్జెక్టుగా పెట్టె నిర్ణయానికి అసెంబ్లీ తీర్మానం చేసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు భవిశ్యత్ లో చేపట్టబోయే బహుళార్ధక సాధక ప్రాజెక్టులపై కూడా చర్చించనుంది. అంతేకాదు కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇదిలావుంటే రాజధాని సహా 21 అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష టీడీపీ సిద్ధమైంది. ప్రధానంగా రాజధానిపై చర్చకు పట్టుబట్టాలని భావిస్తోంది. ఇక ఉల్లి సహా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆర్టీసీ చార్జీల పెంపు, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు, ఇసుక కొరతతో భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ 4, 5 విడతలు ఎగ్గొట్టడం, గ్రామ సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ల నియామకం వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని టీడీపీ నిర్ణయించింది.

ఉల్లితో, నిత్యావసర ధరల పెరుగుదలపై సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే వాయిదా తీర్మానం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాన్ని వ్యూహత్మకంగా ఎదుర్కోవాలని, వాస్తవాల ఆధారంగానే సమాధానం చెప్పేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ, మండలి సమావేశాల వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ నిర్ణయించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories