పాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు

పాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు
x
Highlights

రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచన చేస్తోందని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు.

తుని: రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచన చేస్తోందని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. మూడు రాజధానులు మద్దతుగా తునిలో వైసీపీ శ్రేణులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ప్రారంభించారు. ప్రదర్శన లో కార్యకర్తలు ప్లకార్డులు,పార్టీ పతాకాలు చేతబట్టి పట్టణ పుర వీధుల్లో కదం తొక్కారు. వేలాది మంది కార్యకర్తలు అభిమానులు వెంటరాగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మూడు రాజధానుల కు జై కొట్టారు.

నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల నుంచి కదిలి వచ్చిన యువత, మహిళలు కథనోత్సాహం చూపించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తుంటే చంద్రబాబుకు వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. అమరావతి లో తన అనుచరుల ఆస్తులను కాపాడేందుకు రాజధాని ఈ వ్యవహారంపై రాద్ధాంతం చేస్తున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి పగటివేషగాడిలా చంద్రబాబు శవ యాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులు వ్యవహారంపై చంద్రబాబు రెఫరెండం కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరి బాలు, పోతుల లక్ష్మణ్, ఎం. వెంకటేష్ , రేలంగి రమణ గౌడ్, పోతుల రమణ, అనిశెట్టి సూర్య చక్ర రెడ్డి, దేవవరపు సూర్య చక్రం, ఎస్.కె క్వాజా, బోయపాటి శ్రీను, చోడిశెట్టి సత్య నాగేశ్వరరావు, పామర్తి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories