రైతు బాగుంటే దేశం బాగుంటుంది: మంత్రి అవంతి శ్రీనివాస్

రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.

S. Srikanth
Published on: 1 April 2020 10:50 PM IST
రైతు బాగుంటే దేశం బాగుంటుంది: మంత్రి అవంతి శ్రీనివాస్
X
Avanti Srinivas (File Photo)

విశాఖపట్నం: రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. మంత్రి ముత్తంశెట్టి, జెసి శివశంకర్‌, కొమ్మాది చైతన్య కళాశాలలో ఇటీవల ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను సందర్శించారు. అనంతరం మంత్రి రైతు వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చాలా మంది రైతులు ఆనందపురం, భీమిలి మండలాల నుంచి వచ్చి కూరగాయలు అమ్ముతున్నారని, వారికి రవాణ సౌకర్యాలు లేక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. పేద రైతులను ఆదుకునేందుకు ఆర్‌టిసి బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో కొమ్మాది వద్ద ఉన్న రైతు బజారుకు ప్రజలు ఎవరూ రాకపోవడంతో సరుకులను మిగిలి పోతున్నాయి, అని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story