Visakhapatnam: రైతు బజారులో పర్యటించిన అవంతి శ్రీనివాస్

ఏఎస్ రాజా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రైతు బజార్ ను గురువారం రాష్ర్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పర్యటించారు.

S. Srikanth
Updated on: 26 March 2020 2:48 PM IST
Visakhapatnam: రైతు బజారులో పర్యటించిన అవంతి శ్రీనివాస్
X
Avanthi Srinivas

విశాఖపట్నం: ఏఎస్ రాజా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రైతు బజార్ ను గురువారం రాష్ర్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి అక్కరమాని విజయనిర్మల, అధికారులు, స్థానిక నాయకులు మంత్రి వెంట రైతు బజార్ కు చేరుకున్నారు.

ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సామాజిక దూరం పాటిస్తూ వుండే విధంగా చర్యలు చేపట్టిన సిబ్బందిని కొనియాడారు. కొంత మంది వినియోగదారుల తో మంత్రి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అదే విధంగా ధరలు పెరగకుండా, సూచించిన పట్టిక ధరలను కొనసాగేలా చూడాలని స్థానిక అధికారులుకు నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story