కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పింది వైసీపీ నాయకుల గురించే.. మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

గిరిజనులపై వైసీపీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు హెచ్చరించారు.

Samba Siva Rao
Updated on: 3 Jun 2020 7:47 PM IST
కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పింది వైసీపీ నాయకుల గురించే.. మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
X
Kala Venkatrao (File Photo)

గిరిజనులపై వైసీపీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు హెచ్చరించారు. ప్రజలకు నవరత్నాలు పంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు ఇప్పుడు పంచ భూతాలను పంచుకు తింటున్నారని మండిపడ్డారు. కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడిన ఆయన.. భవిష్యత్‌లో దొంగలే పాలకులు అవుతారని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తే ఎవరి గురించో అనుకున్నామని.. కానీ, ఆయన చెప్పింది వైసీపీ నేతల గురించేనని ఎద్దేవా చేశారు.

టీడీపీ హయాంలో లారీ ఇసుక ధర రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు పలికితే.. ఇప్పుడు 60 వేల రూపాయలు నుంచి 70 వేల రూపాయలు వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఇసుక, మట్టి కూడా వైసీపీ నేతలు అమ్ముకుంటున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు.

ఇసుక కొనలేక పేదలు ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆపేసి పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక దోపిడీకి ప్రభుత్వం అడ్డుకట్ట వేసి సామాన్యులకు ఇసుక అందుబాటులోకి వచ్చేలా దృష్టి సారించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తే.. ఇప్పుడు ఇసుక కావాలంటే వైసీపీ నేతలకు ప్రజలు కమీషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story