ఒక్క రాజధానినే కట్టలేని జగన్ మూడు రాజధానులను కడతారా?: బొండా ఉమ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ పలు విమర్శలు గుప్పించారు.

Samba Siva Rao
Updated on: 6 Jun 2020 8:01 PM IST
ఒక్క రాజధానినే కట్టలేని జగన్ మూడు రాజధానులను కడతారా?: బొండా ఉమ
X
Bonda Uma (File Photo)

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ పలు విమర్శలు గుప్పించారు. ఒక్క రాజధానినే కట్టలేని జగన్ మూడు రాజధానులను ఎలా నిర్మిస్తారని అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చ తాము సిద్ధమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే దీనికి బదులిచ్చారు బోండా ఉమ సంక్షేమ కార్యక్రమాల అమలుపై కుప్పం నుంచే బహిరంగ చర్చలు కుప్పంలోనే కాదని... తాడేపల్లిలోని ఏ గల్లీలోనైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.

జగన్ ఏడాది పాలనలో విధ్వంసం సృష్టించారని బోండా ఉమ విమర్శించారు. విశాఖలో రియలెస్టేట్ వ్యాపారాన్ని పెంచడానికే అక్కడ రాజధాని అంటూ ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టారని మండిపడ్డారు. మాన్సాస్ ట్రస్టు భూములను కూడా ప్రభుత్వం కొట్టేయాలని చూస్తుందని ఆరోపించారు. మంత్రి పదవి కోసం జగన్ కు బాకాలు ఊదే వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. జగన్ కు పాలించడం చేత కావడం లేదని ధ్వజమెత్తారు


Samba Siva Rao

Samba Siva Rao

Next Story