ఏపీకి తరలివస్తున్న సచివాలయ ఉద్యోగులు.. వారందరికీ మంగళగిరిలో కరోనా టెస్ట్ లు

admin1
Published on: 27 May 2020 1:38 PM IST
ఏపీకి తరలివస్తున్న సచివాలయ ఉద్యోగులు.. వారందరికీ మంగళగిరిలో కరోనా టెస్ట్ లు
X

కరోనా వైరస్ నేపధ్యంలో అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు కూడా చాలా మంది హైదరబాద్ లో ఉండిపోయారు. లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులూ సచివాలయం కూడా పెద్దగా కార్యకలాపాలు లేకుండా ఉండిపోయింది. ఇప్పుడు లాక్ డౌన్ తో నిలిచిపోయిన సచివాలయం కార్యాకలాపాలు మరలా ప్రారంభం కానున్నాయి. తమ స్వస్థలం హైదరాబాదులో ఉండిపోయిన ఉద్యోగులంతా తిరిగి విధుల్లో చేరడానికి వస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని హౌస్ క్వారెంటైన్ లో ఉండాల్సి రావడంతో వీరంతా ఇంతవరకు రాలేదు.

అయితే ఇటీవల ఈ నిబంధనలో చాలావరకు సడలింపులు రావడంతో వీరంతా ఏపీ తరలివస్తున్నారు. అయితే ఇప్పటికే వీరంతా 400 మంది ఉద్యోగులు తరలిరావడంతో వారికి ప్రత్యేకంగా మంగళగిరి సీకే నన్వెన్షన్ హాలులో కరోనా టెస్టులు చేస్తున్నారు.

లాక్ డౌన్‌తో ఎక్కడి జనం అక్కడే ఉండిపోయారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో వెసులుబాటు లభించింది. దీంతో దూర ప్రాంతాల్లో చిక్కుకు పోయినవారు సొంత గ్రామాలకు వెళ్తున్నారు. అయితే తెలంగాణ ప్రాంతంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను అమరావతి తరలించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని లేఖ రాశారు.

హైదరాబాద్‌లో సుమారు 400 మంది ఏపీ ఉద్యోగులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. సోమేశ్‌కుమార్ పంపిన లేఖకు తెలంగాణ సీఎస్ స్పందించారు. వారి బస్సులకు అనుమతినిచ్చింది. దీంతో ఈ ఉదయం (27మే) వారిని తొలిదశలో భాగంగా 400ల మందిని మందిని అమరావతికి తరలించారు. మంగళగిరి చేరుకున్న వీరికి కరోనా టెస్ట్ లు చేస్తున్నారు.

Secretariat


admin1

admin1

Next Story