ఇలా ఉంటేనే 'బుల్లెట్' కు పర్మిషన్.. లేదంటే కేసులు తప్పవు

ఇలా ఉంటేనే బుల్లెట్ కు పర్మిషన్.. లేదంటే కేసులు తప్పవు
x
royal enfield motor cycle (representational image)
Highlights

గతంతో పోలిస్తే బుల్లెట్ వాడేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దానికి అనుగుణంగానే చిన్న పట్టణాల్లో సైతం వీటికి సంబంధించిన షోరూంలను సంస్థ ఏర్పాటు చేసింది. వీటితో పాటే వీటిని రిపేరు చేసే ప్రత్యేక నిపుణులు సైతం షెడ్ లు ఏర్పాటు చేస్తున్నారు.

గతంతో పోలిస్తే బుల్లెట్ వాడేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దానికి అనుగుణంగానే చిన్న పట్టణాల్లో సైతం వీటికి సంబంధించిన షోరూంలను సంస్థ ఏర్పాటు చేసింది. వీటితో పాటే వీటిని రిపేరు చేసే ప్రత్యేక నిపుణులు సైతం షెడ్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా వీటి వినియోగం పెరగడం, కొనుగోలు దారులు ఇష్టారాజ్యంగా వ్యవహిరంచడంతో తిరుపతి పోలీసులు కన్ను వేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేయడమే కాదు... మోటారు సైకిళ్లను ఏకంగా సీజ్ చేస్తున్నారు.

బుల్లెట్..యువ‌తను ఎక్కువ‌గా ఆక‌ర్షించే వెహిక‌ల్. రాయ‌ల్ లుక్ ఇస్తుంది కాబ‌ట్టి చాలా మంది దీన్ని కొనుగోలు చేస్తారు. అంతేనా కొన్న‌త‌ర్వాత ఎవ‌రికి వారు త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా రీ మోడ‌లింగ్ చేయిస్తారు. ముఖ్యంగా బీటింగ్ లో మార్పు కోసం సైలెన్స‌ర్ మార్పిస్తారు. దీంతో అవి ర‌య్..ర‌య్ మంటూ అధిక శ‌బ్దంతో రోడ్డుపై దూసుకువెళ్తాయి. అయితే ఇక‌పై ఇలాంటి ఎక్కువ సౌండ్ చేసే బుల్లెట్ల ప‌రుగుల‌కు బ్రేకులు ప‌డ‌నున్నాయి.

అధిక శబ్ధం వచ్చే బుల్లెట్ వాహనాలపై తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. గ‌వ‌ర్న‌మెంట్ రూల్సుకు వ్యతిరేకంగా బుల్లెట్ వాహనాల సైలెన్సర్​లకు ఎక్కువ‌ శబ్దం వచ్చే మఫ్లర్లను వాడుతున్న వారిని గుర్తించి భారీ ఫైన్లు వ‌డ్డిస్తున్నారు. బుల్లెట్ వాహనాల శబ్ద కాలుష్యంపై తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డికి చాలా కంప్లైంట్లు అంద‌డంతో..స‌ద‌రు వాహనాలపై చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు సిటీలోని నగరంలోని మెయిన్ సెంట‌ర్ల‌లో చెకింగ్స్ నిర్వహించి నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా తిరుగుతోన్న‌ బుల్లెట్ వాహనాలను సీజ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories