Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3: పోలింగ్ Live Updates

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల మూడోదశ పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ లైవ్ అప్ డేట్స్ ..

Sandeep Eggoju
Updated on: 17 Feb 2021 1:49 PM IST

ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిస్తేనే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

Live Updates

  • 17 Feb 2021 10:46 AM IST

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    కడప జిల్లాలో:

    కడప జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 129 సర్పంచ్ స్థానాలకు, 824 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

  • 17 Feb 2021 10:19 AM IST

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    విజయనగరం జిల్లా:

    విజయనగరం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్

    ఉదయం 9-30 గంటలకు 42.5 శాతం పోలింగ్ నమోదు

  • 17 Feb 2021 10:13 AM IST

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    తూర్పు మన్యంలో:

    తూర్పు మన్యంలో పంచాయతీ మూడో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో భారీ భద్రత మధ్య పోలింగ్‌ జరుగుతోంది.

  • 17 Feb 2021 10:10 AM IST

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    అనంతపురం:

    ఉదయం 9.30 గంటల వరకు 32.21 శాతం.

  • 17 Feb 2021 10:09 AM IST

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    ప్రకాశం జిల్లా:

    మూడో విడత పంచాయతీ ఎన్నికలు , ఉదయం 9:30 గంటల వరకు 11.04 శాతం నమోదు.

  • 17 Feb 2021 10:08 AM IST

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    గుంటూరు జిల్లా:

    - గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా మూడో విడత పోలింగ్.

    - ఇప్పటి వరకు 24 శాతం పోలింగ్.

    - గురజాల డివిజన్ లోని 134 గ్రామాల్లో ఎన్నికలు.

    - 98 గ్రామాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 36 గ్రామాల్లోపోలింగ్.

    - మాచర్ల నియోజకవర్గం లో కేవలం 3 గ్రామాల్లోనే పోలింగ్

    - బ్యాలెట్ పేపర్ లో ముద్రణ తప్పులతో మాడుగుల గ్రామం లో రెండు వార్డుల్లో ఎన్నికలు 21 కి వాయిదా

  • 17 Feb 2021 10:07 AM IST

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    విజయవాడ:

    - కృష్ణా, గుంటూరు జిల్లాలలో పోలింగ్ ను పరిశీలించనున్న పంచాయితీరాజ్ కమీషనర్ గిరిజాశంకర్

    - అవనిగడ్డలో ముందుగా పోలింగ్ ను పరిశీలించనున్న కమిషనర్ గిరిజాశంకర్

  • 17 Feb 2021 10:06 AM IST

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    తూర్పుగోదావరి :

    రంపచోడవరం

    రంపచోడవరం రెవెన్యూ సబ్ డివిజన్ లో ఉదయం 8:30 వరకు 15 శాతం పోలింగ్ నమోదు..

  • 17 Feb 2021 10:04 AM IST

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    కర్నూలు జిల్లా: 

    మూడవ దశ గ్రామ పంచాయతీల పోలింగ్ శాతం ఉదయం 8:30 గంటల వరకు :: 15.39 శాతం

    కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్

  • 17 Feb 2021 9:11 AM IST

    Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

    చిత్తూరు జిల్లా: 

    చిత్తూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మదనపల్లి డివిజన్‌ పరిధిలోని 10 మండలాల్లో ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో ఒక మండలం, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి పెరిగింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story