Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3: పోలింగ్ Live Updates
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల మూడోదశ పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ లైవ్ అప్ డేట్స్ ..
ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిస్తేనే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
Live Updates
- 17 Feb 2021 11:20 AM IST
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
కడప :
- కడప జిల్లాలొ పంచాయతీ ఎన్నికలు
- ఉదయం 10.30 గంటలకు.. 30.07 శాతం౹ పోలింగ్
- 17 Feb 2021 11:19 AM IST
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
విజయవాడ:
ఇప్పటి వరకూ ఏపీలో పోలింగ్ శాతం 40.29%
- 17 Feb 2021 11:19 AM IST
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
ప్రకాశం జిల్లా:
- కొండేపి మండలం జాల్లపా లెం గ్రామంలో ఉద్రిక్తత.
- టీడీపీ, వైసీపీ కార్యకర్త ల మధ్య తోపులాట.
- టీడీపీ మద్దతు దారుడు పోలింగ్ బూత్ ఏజంట్ ను పోలింగ్ కేంద్రం వద్దకు రానివ్వకుండా అడ్డుకున్న వైసీపీ మద్దతు దారులు.
- ఇరువర్గాల మద్య ఘర్షణ.
- రంగంలోకి దిగిన పోలీసులు.
- 17 Feb 2021 10:57 AM IST
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
కుప్పం పంచాయతీ పోలింగ్ లో ఉద్రిక్తత:
- శాంతిపురం మండలం మఠం, సంతూరు పంచాయతీల్లో ఓటరు స్లిప్పులతో పాటు అభ్యర్తి గుర్తు ముద్రించిన స్లిప్పుల పంపిణీ చేస్తున్నారని ప్రత్యర్థి అభ్యర్తులు ఆక్షేపణ
- ఓటరు గుర్తు స్లిప్పులను పట్టుకున్న కొందరు గ్రామస్తులు.
- వైసిపి మద్దతుదారులు స్లిప్పుల పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్న టిడిపి మద్దతుదారులు.
- ఇరువర్గాలను శాంతింపజేసిన పోలీసులు
- 17 Feb 2021 10:56 AM IST
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
చిత్తూరు జిల్లా:
చిత్తూరు జిల్లాలో 40శాతం పోలింగ్ నమోదు
- 17 Feb 2021 10:55 AM IST
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
శ్రీకాకుళం:
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, సతీమణి సర్పంచ్ అభ్యర్థి వాణి సీతారాం తమ ఓటు హక్కును తోగారం గ్రామంలో వినియోగించుకున్నారు
- 17 Feb 2021 10:53 AM IST
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
విజయనగరం:
3వ విడత సర్పంచ్ ఎన్నికలలో 9 మండలాల్లో ఉదయం 9.30 గంటలకు 42.5 శాతం ఓటింగ్ నమోదైంది
- మెరకముడిదాం-41.4
- చీపురుపల్లి-32.2
- గరివిడి -39.2
- గుర్ల-48.4
- నెల్లిమర్ల - 46.8
- పూసపాటిరేగ-42.1
- భోగాపురం- 42.6
- డెంకాడ -44.8
- విజయనగరం-44
- 17 Feb 2021 10:52 AM IST
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
నెల్లూరు:
గూడూరు , నాయుడుపేట డివిజన్ లలో ఉదయం 9.30 వరకు నమోదైన పోలింగ్ శాతం 24.02.
- 17 Feb 2021 10:51 AM IST
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
తూర్పుగోదావరి :
అడ్డతీగల
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ప్రమాదకర వాగు దాటి వచ్చిన అడ్డతీగల మం. వేటమామిడి పంచాయతీ పరిధిలోని పనుకురాతిపాలెం గిరిజనులు.
మడేరు వాగుపై ప్రమాదకరమైన కర్రల వంతెనను దాటి ఓట్లు వేసిన గిరిజన మహిళలు.
ఎన్నిసార్లు ఓట్లు వేసినా తమ ఊరికి వంతెన నిర్మించడం లేదని వాపోయిన పనుకురాతిపాలెంకు చెందిన వంద కుటుంబాల గిరిజన ప్రజలు.
- 17 Feb 2021 10:50 AM IST
Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
ప.గో. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్:
ప.గో. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు.
- పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్న ఓటర్లు.
- ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా వస్తున్న మహిళలు, వృద్ధులు.