Kurnool: ఎమ్మెల్యే కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్

పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్ రెడ్డి వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు.

S. Srikanth
Published on: 27 Feb 2020 7:26 PM IST
Kurnool: ఎమ్మెల్యే కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
X
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి

కర్నూలు: పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్ రెడ్డి వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. గురువారం కర్నూలు నగరంలోని రాగమయూరి రీస్టార్ట్ లో జరిగిన వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఒకే వేదికపై జరిగిన స్వర్గీయ చెరుకులపాడు నారాయణరెడ్డి దంపతుల కుమారుడు రామ్మోహన్ రెడ్డి వివాహంతో పాటు వారి సమీప బంధువు వైఎస్సార్ సిపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి కుమారుడు శివారెడ్డిల వివాహ వేడుకలలో కూడ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు


S. Srikanth

S. Srikanth

Next Story