YS Jagan: ఈ నెల 5న ఏపీ మంత్రివర్గ సమావేశం..

Samba Siva Rao
Updated on: 2 Jun 2020 11:24 AM IST
YS Jagan: ఈ నెల 5న ఏపీ మంత్రివర్గ సమావేశం..
X
YS Jagan (File Photo)

ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, కరోనా కట్టడి చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

గతంలో ప్రతి నెల రెండు, నాలుగో బుధవారాల్లో కేబినేట్ భేటీ నిర్వహించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి వల్ల అది సాధ్య పడలేదు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం కోసం రూపొందించిన ప్రత్యేక ఆర్డినెన్సుతోపాటు ఇంకా పలు కీలకాంశాలపై ఈ-ఫైలింగ్‌ సంతకాలు సేకరించారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్యోగులు 100 శాతం హాజరు కావాలని ఆదేశాలివ్వడంతో, మంత్రివర్గ భేటీ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story