Cabinet Meeting: రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం

Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం

Sandeep Eggoju
Published on: 16 Nov 2021 7:37 PM IST
Andhra Pradesh Cabinet Meeting Tomorrow
X

రేపు ఆంధ్రప్రదేశ్ కాబినెట్ మీటింగ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Cabinet Meeting: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన రేపు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, పలు బిల్లులకు సంబంధించిన అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి ఒక్కరోజు మాత్రమే జరగనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వచ్చే నెలలో మరోసారి అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని ఏపీ సర్కారు ఆలోచిస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story