AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా

AP Cabinet: సీఎం అధ్యక్షతన ఆగస్టు 2న జరగవల్సిన భేటీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 July 2024 7:12 PM IST
Andhra Pradesh Cabinet meeting postponed
X

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా

AP Cabinet: AP మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఆగస్టు 2న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగవలసిన సమావేశం ప్రభుత్వ కార్యాక్రమాల వల్ల వాయిదా వేశారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండడంతో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. పింఛన్ల పంపిణీని పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి సహా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంత్రులు సైతం పంపిణీలో పాల్గొననున్నారు. పింఛన్ల పంపిణీ పూర్తి అయిన తర్వాత వారం చివరలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలైన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇళ్ల పంపిణీ తదితర హామీలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story