SPY Agro Industries Ltd: నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో ప్రమాదం.. ఒకరు మృతి

Arun Chilukuri
Published on: 6 Aug 2020 11:44 AM IST
SPY Agro Industries Ltd: నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో ప్రమాదం.. ఒకరు మృతి
X

SPY Agro Industries Ltd: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని బాయిలర్ లీక్ అవడంతో లక్ష్మణమూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా నంద్యాలలో ఎస్పీవై ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ఒకరు చనిపోగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణ భయంతో స్థానికులు కూడా పరుగులు తీశారు. మళ్లీ ఎస్పీవై ఫ్యాక్టరీలోనే ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story