Electric Cemetery in Kurnool: కర్నూలులో విద్యుత్ స్మశాన వాటికలు.. ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ కార్పోరేషన్

Electric Cemetery in Kurnool: కర్నూలులో విద్యుత్ స్మశాన వాటికలు.. ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ కార్పోరేషన్
x
Electric Cemetery in Kurnool
Highlights

Electric Cemetery in Kurnool: కరోనా వచ్చిదంటే వైద్యం మాట అటుంచి, ముందు సమాజానికి దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఇదే కాదు.... వీరికి వైద్య సాయం అందించడం మరింత గగనమే

Electric Cemetery in Kurnool: కరోనా వచ్చిదంటే వైద్యం మాట అటుంచి, ముందు సమాజానికి దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఇదే కాదు.... వీరికి వైద్య సాయం అందించడం మరింత గగనమే. ఏదోలా వైద్యం పొంది తిరిగి ఆరోగ్యంతో బయటకు వస్తే ఒకే... ఒకవేళ ఖర్మచాలక మరణిస్తే ఇక ఆ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రావడం లేదు. దీంతో అంతిమ సంస్కారాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. వీటికి స్వస్తి పలికేందుకు కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.. ప్రత్యేకంగా విద్యుత్ స్మశాన వాటికలు ఏర్పాటు చేసి, వాటిలో ఈ కరోనా సోకి మరణించిన వారిని ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లా కేంద్రమైన కర్నూలులో విద్యుత్‌ శ్మశాన వాటికలు ఏర్పాటు కానున్నాయి. జమ్మిచెట్టు ప్రాంతం,సుంకేసుల రోడ్డులో ఉన్న హిందూ శ్మశాన వాటికల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జమ్మిచెట్టు ప్రాంతంలో పనులు పూర్తికాగా.. నేడో, రేపో జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌తో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిని కోవిడ్, సాధారణ మృతదేహాల అంతిమ సంస్కారాలకు వినియోగించనున్నారు. కరోనాతో చనిపోయిన వారిని శ్మశాన వాటికలకు తరలించడం నుంచి.. పూడ్చే వరకు సమస్యలు వస్తున్నాయి. సాధారణ మృతదేహాల అంత్యక్రియలను సైతం అడ్డుకునపరిస్థితులు దాపురించాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్‌ శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించారు.

అహమ్మదాబాద్‌ నుంచి..

వాతావరణ కాలుష్యం లేకుండా విద్యుత్‌ క్రిమిషన్లతో మృతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేయవచ్చు. వీటిని జైపూర్, ముంబయి ప్రాంతాల్లో వాడుతున్నారు. అహమ్మదాద్‌ నుంచి ఒక ఎలక్ట్రికిల్‌ క్రిమిషన్‌ కర్నూలుకు చేరుకుంది. రవాణా చార్జీలు, ఇన్‌స్టలేషన్‌ కోసం రూ.70 లక్షలు (జనరల్‌ ఫండ్‌ నిధులు ) కేటాయించారు. దీనిని జమ్మిచెట్టు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను నగర పాలక కమిషనర్‌ డీకే బాలాజీ, డీఈ రాధక్రష్ణ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పనులు పూర్తయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories