
Ambulance catches fire: నడిరోడ్డుపై తగలబడిపోయిన అంబులెన్స్
Ambulance catches fire in Vijayawada: విజయవాడలో రోడ్డుపై ఒక పక్కన పార్క్ చేసి ఉన్న అంబులెన్స్ లో మంటలు చెలరేగి పూర్తిగా తగలబడిపోయింది. మంటల్లో...
Ambulance catches fire in Vijayawada: విజయవాడలో రోడ్డుపై ఒక పక్కన పార్క్ చేసి ఉన్న అంబులెన్స్ లో మంటలు చెలరేగి పూర్తిగా తగలబడిపోయింది. మంటల్లో పూర్తిగా దగ్ధమైన అంబులెన్స్ విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి చెందిన వాహనంగా తెలుస్తోంది.
ఈ ఘటన జరిగిన సమయంలో అంబులెన్స్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అంబులెన్స్ లో చెలరేగిన మంటలు ఆ పక్కనే ఉన్నబస్టాండ్ కు కూడా వ్యాపించాయి. దాంతో బస్టాండ్ కూడా పాక్షికంగా దెబ్బతింది.
రమేశ్ హాస్పిటల్స్ ఎదురుగానే ఈ ఘటన జరగడంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఆస్పత్రిలోని ఫైర్ ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చి మంటలను ఆర్పినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే అంబులెన్స్ వాహనం పూర్తిగా కాలిపోయింది.
అంబులెన్స్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆగి ఉన్న అంబులెన్స్‌లో మంటలు ఎలా చెలరేగాయనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




