108 and 104 services in AP: ఆధునిక హంగులతో 108,104 వాహనాలు.. జులై 1న ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్

108 and 104 services in AP: ఆధునిక హంగులతో 108,104 వాహనాలు.. జులై 1న ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్
x
Highlights

108 and 104 services in AP: కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

108 and 104 services in AP: కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా కొనుగోలు సాంకేతిక పరిజ్ఞానంతో 108,104 వాహనాలను అందుబాటులోకి తీసుకురాన్నున్నారు. జులై 1వ తేదీ సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జునరావు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితుల్లో బాధితులను రకక్షించడంలో భాగంగా ఈ వాహనాలు పనిచేయనున్నాయి. రెస్‌మెడ్ నుంచి కొనుగోలు చేసిన మొబైల్‌ వెంటిలేటర్లను అమరుస్తారు. 104 వాహనాల్లోనూ వెంటిలేటర్‌తో పాటు డిఫ్రిబ్యులేటర్‌, పల్సాక్సీ మీటర్‌ వంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. త్వరలోనే వీటిని వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు. చిన్నారుల కోసం 26 నియోనేటల్ అంబులెన్సులు అందుబాటులో ఉంచనున్నారు.

సుమారు 203.47 కోట్ల రూపాయల వ్యయంతో వాహనాలు కొనుగోలు చేయనున్నారు. కొత్తగా వచ్చే 104 వాహనం మండలానికి ఒకటి అందుబాటులోకి ఉంచుతామని మల్లిఖార్జున్ రావు చెప్పారు. ఇప్పటికే 108 వాహనాలు 412 సిద్ధం చేసినట్లు వివరించారు. 104 వాహనాలు లైఫ్ సపోర్టు ఉంటుందన్నారు. ఇక లైఫ్ సపోర్టు బేసిక్ వాహనాలు 282 ఉంటాన్నాయని104 వాహనాలు 676 అందుబాటులో ఉంటాయనీ ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదం జరిగిన 20నిమిషాల్లో వాహనం వెళుతుందని, పట్టణ ప్రాంతంలో15 నిమిషాల వ్యవధిలో వెళ్తుందని.., ఏజెన్సీ ప్రాంతంలో 25 నిమిషాల్లో వెళ్తుందనీ ఆరోగ్య శ్రీ సీఈఓ మల్లి ఖార్జున్ రావు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories