Coronavirus Updates in AP: ఏపీలో మరో 706 కరోనా పాజిటివ్ కేసులు
706 new coronavirus cases in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 706 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,216 శాంపిల్స్‌ని పరీక్షించగా 706 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 302 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కర్నూలు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు ఉన్నారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 11,554. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 180. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4987కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 6387 మంది చికిత్స పొందుతున్నారు.




