Akividu: వార్డులలో పర్యటిస్తు సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మంతెన రామరాజు
Manthena Ramaraju
ఆకివీడు: కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ లో ఉన్న ప్రజలు ఇబ్బందులను ఆకివీడు వార్డులలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తిరిగి సమస్యలు అడిగి తెలుసుకుని అధికారులకు సూచనలు చేశారు. ఆకివీడు పల్లెవీధి, హరిజనవాడ, డైలీ మార్కెట్ వీధులలో మహిళలు పైపులు ద్వారా వచ్చే మంచినీటి సరఫరా సరిగా జరగడంలేదని ఎమ్మెల్యే దృష్టికి తేగా అధికారులకు సమస్య వివరించి ఎమ్మెల్యే తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మోటుపల్లి రామవర ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు బొల్లా వెంకట్రావు, పి.శ్రీనివాసరాజు, పొన్నామండ నరసింహారావు, కారడి దుర్గారావు, చేబ్రోలు పెద్దిరాజు, మీగడ నాగరాజు, చేబ్రోలు అజయ్, చేబ్రోలు శ్రీనివాస్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Next Story




